పేద కార్మికురాలి ఇంటి నిర్మాణానికి సిమెంట్ బస్తాల సాయం
రిపోర్టర్: Anjaneyulu Yadav
స్థలం: కల్వకుర్తి
కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామానికి చెందిన కార్మికురాలు నిర్మల ఇల్లు ఆర్థిక ఇబ్బందుల వల్ల అసంపూర్తిగా నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ వెంటనే స్పందించి ఆమెకు సిమెంట్ బస్తాలను అందజేశారు.