స్థానిక సంస్థల ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వాలి: కూటమి సర్కార్కు విజ్ఞప్తి
రిపోర్టర్: andluri ganesh
స్థలం: గజపతినగరం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులకు సముచిత రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని విజయనగరం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జాయింట్ సెక్రెటరీ అండ్లూరి గణేష్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా అండగా నిలుస్తూ సామాజిక న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నామినేటెడ్ పదవులు, స్థానిక ఎన్నికల్లో సముచిత అవకాశాలు కేటాయించాలని, తద్వారా తమ సామాజిక వర్గానికి గుర్తింపు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.