సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో బీజేపీ నేతల విస్తృత సేవలు
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు స్వచ్ఛతా అభియాన్, మొక్కలు నాటే కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఈ కార్యక్రమాల ద్వారా స్వచ్ఛ, ఆరోగ్యకరమైన, హరిత భారతాన్ని ఆవిష్కరించే దిశగా ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నట్లు బీజేపీ స్పష్టం చేసింది.