శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ రావణ పోస్టర్‌తో వివాదంలో 'రామాయణం' టీమ్

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన 'రామాయణం' చిత్ర బృందం యష్ రావణుడిగా ఉన్న పోస్టర్‌ను విడుదల చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన రోజున రావణుడిని ప్రమోట్ చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడుతున్నారు. విష్ణువు లేదా శ్రీరాముడి పోస్టర్ వేయాల్సింది పోయి, ఇలాంటి ప్రచారం చేయడంపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఈ మార్కెటింగ్ వ్యూహంపై అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.