స్లీప్ రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్: రాత్రి వేళ తినే రుగ్మతను అధిగమించడమెలా

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయవాడ

రాత్రి పడుకున్నాక అర్ధరాత్రి వేళ తెలియకుండానే ఆహారం తినే రుగ్మతను స్లీప్ రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్ అంటారుని నిద్ర రుగ్మతల నిపుణులు డాక్టర్ హరిణి పావులూరి వెల్లడించారు. ఉదయం లేచాక రాత్రి ఏం తిన్నారనేది అస్సలు గుర్తుండదని ఆమె తెలిపారు. కొన్ని రకాల మందులు, నిద్రలేమి, గురక సమస్యలు దీనికి కారణం కావచ్చని, తగిన వైద్య చికిత్సతో పాటు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా ఈ సమస్యను విజయవంతంగా తగ్గించవచ్చని డాక్టర్ హరిణి పావులూరి స్పష్టం చేశారు.