భక్తులకు తీపి కబురు: తిరుమలలో త్వరలో గరుడ మ్యాప్ యాప్

రిపోర్టర్: కృష్ణ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరి సహాయం లేకుండా తాము చేరుకోవాల్సిన ప్రాంతాలకు సులువుగా వెళ్లేలా గరుడ మ్యాప్ యాప్ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉండే ఈ సరికొత్త యాప్ మరో రెండు రోజుల్లో భక్తులకు అందుబాటులోకి రానుందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.