గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను ఢీకొట్టిన కారు డ్రైవర్ అరెస్ట్

రిపోర్టర్: నరేష్ స్థలం: Gurugram

గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై మహిళా బైకర్ సియాను కారుతో ఢీకొట్టి పరారైన డ్రైవర్ కళ్యాణ్ బైన్స్లాను రాజస్థాన్‌లోని దౌసాలో పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిపై హత్యాయత్నం (సెక్షన్ 109) కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు, చట్టంతో ఆటలాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.