ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఏలూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నేత ఆళ్ల నాని గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మంగళవారం అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఏలూరుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.