మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష

రిపోర్టర్: రాజేష్ స్థలం: తిరుపతి

తిరుపతి జిల్లాలో మద్యం సేవించి వాహనం నడిపిన ఒక వ్యక్తికి కోర్టు పద్నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు జిల్లా పోలీసులు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గాజులమండ్యం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కీలక తీర్పు వెలువరించినట్లు అధికారులు తెలిపారు.