విదేశీ మద్దతుతోనే మోడీ పాలన: ప్రధాని వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ధ్వజం

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

దేశ ప్రజలతో అబద్ధాలు చెప్పడం ఆపాలని ప్రధాని నరేంద్ర మోడీకి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచించారు. విదేశీ సాయం వల్లే ఆయన ప్రధాని అయ్యారని, ఇప్పటికీ అదే మద్దతుతో పదవిలో కొనసాగుతున్నారని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి వేడుకల్ లో మోడీ చేసిన విమర్శలకు ఆయన ఈ విధంగా ఘాటుగా స్పందించారు.