నర్సీపట్నంలో ఘనంగా జరిగిన టీడీపీ నేత చింతకాయల రాజేష్ జన్మదిన వేడుకలు
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై తొమ్మిదవ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు చింతకాయల రాజేష్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాజేష్‌కు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థి అడిగేల సతీష్, ఫణీ, ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కన్యకా సతీష్ తదితరులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.