వాయు కాలుష్య నియంత్రణలో విజయవాడ ప్లాంట్‌కు జాతీయ గుర్తింపు
రిపోర్టర్: విజయ్
స్థలం: దిల్లీ
వాయు కాలుష్య నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఉత్తమ విధానాలపై కేంద్ర పర్యావరణ శాఖ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఇందులో విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ కేంద్రం పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించింది. రోజుకు 200 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేస్తూ ఇటుకలు, కంకర తయారు చేస్తున్న ఈ ప్లాంట్ విధానాన్ని జాతీయ స్థాయిలో అభినందించారు.