సెప్టెంబర్ 7 నుంచి 'కాక' షూటింగ్: జనవరి 13న గ్రాండ్ రిలీజ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న 'కాక' సినిమా షూటింగ్ సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభం కానుంది. ఈ కీలక షెడ్యూల్‌లో మెగాస్టార్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొననున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.