అబుదాబిలో విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసిన ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు ఎర్లింగ్ హాలాండ్
రిపోర్టర్: మహేష్
స్థలం: అబుదాబి
మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ స్టార్ ఎర్లింగ్ హాలాండ్ అబుదాబిలోని యాస్ ఐలాండ్లో కొత్తగా విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసినట్లు ఆటగాడు వెల్లడించారు. తన తండ్రితో కలిసి ఈ ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిద్వారా యూఏఈ పదేళ్ల గోల్డెన్ వీసా పొందే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని స్పష్టం చేశారు.