మహబూబాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణి: అర్జీల స్వీకరణతో పాటు అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
రిపోర్టర్: శివ
స్థలం: మహబూబాబాద్
మహబూబాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు దరఖాస్తుల పరిష్కారంతో పాటు వసతి గృహాల పర్యవేక్షణ, ఉద్యోగుల మీ ప్రమాణం యాప్ హాజరు వివరాలపై తగు ఆదేశాలు జారీ చేశారని కలెక్టర్ మహబూబాబాద్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల సమస్యలను ఓపికగా విన్నారు.