స్పోర్ట్స్ అప్డేట్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి మనీష్ పాండే ఎంపిక

రిపోర్టర్: హరి స్థలం: Mysore

కర్ణాటక రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనీష్ పాండేను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీవంటీ టోర్నమెంట్ ముప్పై నాలుగు మంది ప్రాబబుల్స్ జాబితాలో ఎంపిక చేసినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. గత సీజన్ నుంచి రాష్ట్ర జట్టుకు దూరంగా ఉన్న ఆయన, నవంబర్ పద్నాలుగు నుంచి ప్రారంభం కానున్న ఈ పోటీలలో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు వ్యక్తిగత కారణాల వల్ల త్రిపుర జట్టుకు ఆడుతున్న భారత టెస్ట్ బ్యాటర్ విహారి రంజీ క్యాంపెయిన్కు దూరంగా ఉన్నట్లు కోచ్ సత్రాజిత్ లహిరి తెలిపారు.