పోలీసుల తీరుపై వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం మరియు హెచ్చరిక
రిపోర్టర్: మహేష్
స్థలం: కడప
వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనుచరులతో కలిసి బూతులోకి వెళ్తున్న ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ప్రతి ఒక్క పోలీసుకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.