ట్రోలర్స్‌కు ఎంపీ కంగనా రనౌత్ గట్టి కౌంటర్
రిపోర్టర్: సతీష్
స్థలం: బిహార్
బిహార్ బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్ ఖరీదైన కారు కొనుగోలు చేయడంపై వస్తున్న ట్రోల్స్‌పై ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ నాయకులు లగ్జరీగా బతికితే కొంతమందికి కళ్లు మండుతాయని విమర్శించారు. తాము సొంత కష్టంతో సంపాదించుకున్నామని, ప్రజాసేవలో ఉన్నంత మాత్రాన సౌకర్యాలు వదులుకోవాలని ఆశించడం అర్థరహితమని ఆమె పేర్కొన్నారు.