పోషణ మాసంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నేదురుపల్లి అరుంధతి వాడ అంగన్వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వెంకటాచలం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ విజయలక్ష్మి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులకు పౌష్టికాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మెనూ ప్రకారం విటమిన్లు, ఐరన్ ఉన్న ఆహారం అందించాలని సూచించారు.