తంతడి బీచ్ వద్ద అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన చంద్రశేఖర్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పరవాడ
పరవాడ మండలంలోని తంతడి బీచ్లో దాసరి చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైనట్లు సీఐ భాస్కరరావు తెలిపారు. ఈ నెల ఇరవై నాల్గవ తేదీన స్కూటీపై బయటకు వెళ్లిన చంద్రశేఖర్ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా బీచ్ సమీపంలో అతడి వాహనం కనిపించింది. ఆదివారం ఉదయం మృతదేహం లభించింది. వ్యక్తిగత ఆర్థిక సమస్యలతో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానించి కేసు నమోదు చేశారు.