కడ్తాల్లో కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కడ్తాల్

నాగర్కర్నూల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకుడు అమృతం పాండు ఆయనను శాలువాతో సన్మానించారు. పార్టీ మండల అధ్యక్షుడు కంబాలపల్లి పరమేష్, ఆర్యవైశ్య నాయకుడు శ్రీను గుప్తాతో పాటు పలువురు నాయకులు కేటీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేటీఆర్ పర్యటనలో సందడి చేశారు.