టెక్ రంగంలో ఐఐటీ పట్టాలు లేకున్నా సత్తా చాటుతున్న భారతీయులు
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన టెక్ అండ్ డేటా ఎగ్జిక్యూటివ్స్ జాబితాలో పలువురు భారతీయ సంతతి నిపుణులు చోటు దక్కించుకున్నారు. ఓపెన్ఏఐ అప్లికేషన్స్ సీటీవో విజయ్ రాజి, ఆంత్రోపిక్ సీటీవో రాహుల్ పాటిల్ తదితరులు ఐఐటీ పట్టాలు లేకుండానే అత్యున్నత స్థానాలకు చేరుకుని సంచలనం సృష్టించారు. సాంకేతిక రంగంలో కేవలం ప్రతిభే ప్రధానమని వీరి విజయాలు నిరూపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.