తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి సామ్ కోషి నియామకం
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పి సామ్ కోషి నియమితులయ్యారని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టుకు జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పదోన్నతి పొందడంతో ఈ ఖాళీ ఏర్పడింది. తదుపరి ఏర్పాట్లు జరిగే వరకు ఆయన తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా విధులు నిర్వర్తించనున్నారు. హైకోర్టులో అత్యంత సీనియర్ జడ్జిగా సేవలందిస్తున్న ఆయనకు ఈ కీలక బాధ్యతలను అప్పగిస్తూ తగిన అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.