ఢిల్లీ భవన కూల్చివేత ఘటనలో విద్యార్థి మృతి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో జరిగిన ఐదు అంతస్తుల భవన కూల్చివేత ఘటనలో మధ్యప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల అర్పిత్ జై ప్రాణాలు కోల్పోయాడు. రక్షాబంధన్ సెలవుల అనంతరం పీజీకి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం సంభవించింది. పుత్రశోకంలోనూ కుమారుడి నేత్రాలను దానం చేసి ఆ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.