గువాహటి ఘటన: పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునే యత్నంలో నిందితుడి కాల్చివేత
రిపోర్టర్: సతీష్
స్థలం: Guwahati
గౌహతి విశ్వవిద్యాలయ విద్యార్థిని నిమిషా ఠారియా హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆషిక్ అలీ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ధారాపూర్ ప్రాంతంలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అతడి కాలికి గాయమైందని తెలిపారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం గౌహతి వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.