మజ్జి శ్రీనివాసరావును కలిసిన కూటమి నాయకులు: పార్టీలో చేరికపై అభినందనలు
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు మాజీ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును, వారి కుమార్తె సిరి సహస్రను స్వగృహంలో కలిసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు గోన మానస మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మరింత ప్రచారం చేయాలని కోరారు.