కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటరు నమోదు షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: గుంటూరు

కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటరు జాబితాలో అర్హులైన ఉపాధ్యాయులు, లెక్చరర్లు పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ గుంటూరు వెల్లడించారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. భారతదేశ పౌరులై సంబంధిత నియోజకవర్గంలో నివసిస్తూ గత ఆరు సంవత్సరాలలో కనీసం మూడు సంవత్సరాలు పనిచేసిన వారు అర్హులని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్ సూచించారు. సహాయం కొరకు టోల్ ఫ్రీ నంబర్ 1950 సంప్రదించాలని పేర్కొన్నారు.