'మహిళా సాధికారతను ఘనంగా చాటబోతున్నాం': ఎంపీ కేశినేని శివనాథ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయవాడ

ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌ తరహాలోనే మంగళగిరి స్టేడియంలో ఉమెన్ ఏపీఎల్‌ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఈ నెల 19 నుంచి 27 వరకు డే అండ్ నైట్ విధానంలో నాలుగు టీమ్‌లతో ఈ టోర్నమెంటు జరగనుందని, ప్రారంభోత్సవానికి నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా విచ్చేస్తారని చెప్పారు. ప్రేక్షకులు ఉచితంగా మ్యాచ్‌లు వీక్షించేందుకు ఏర్పాట్లు చేశామని, ఈ టోర్నీ ద్వారా మహిళా సాధికారతను ఘనంగా చాటబోతున్నామని ఆయన స్పష్టం చేశారు.