ఇచ్ఛాపురం దాసన్నపేటలో అగ్నిప్రమాదం కారణంగా లక్షల్లో ఆస్తి నష్టం

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

ఇచ్ఛాపురం మండలం దాసన్నపేటలో జరిగిన భారీ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దుకాణాల్లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో వ్యాపారులకు లక్షలాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో వస్తువులు కాలిపోయి వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు తక్షణమే స్పందించి నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు.