గనుల శాఖలో ఖాళీల భర్తీకి సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
గనులు, భూగర్భ వనరుల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను నిబంధనల మేరకు వేగవంతం చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్రమ ఇసుక రవాణా, తవ్వకాలను అరికట్టేందుకు విజిలెన్స్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు.