స్థానిక ఎన్నికల బందోబస్తుపై ఎస్ఈసీ అనిల్చంద్ర పునేఠా కీలక ప్రకటన

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్లో నవంబరు 1న జరగనున్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పోలింగ్కు పటిష్ఠమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా తెలిపారు. ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా వచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.