'మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి దుర్మార్గం': అసెంబ్లీ ఘటనపై తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Hyderabad

తెలంగాణ అసెంబ్లీ వద్ద మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గమని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సీనియర్ మహిళా ఎమ్మెల్యేల గొంతు పట్టి నెట్టేయడం, చీరలు లాగడం, బూటు కాళ్లతో తొక్కి హింసించడం దారుణమన్నారు. రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలకే భద్రత లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటని నిలదీశారు.