చిట్వేల్ మండలంలో అక్రమ టపాసుల నిల్వపై పోలీసుల దాడులు
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
చిట్వేల్ మండలం చిల్లవాండ్లపల్లె గ్రామ సమీపంలోని మామిడి తోటలో అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న టపాసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ఎస్. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో రూ.1,26,510 విలువైన ఎనిమిది రకాల టపాసులు పట్టుబడ్డాయి. లైసెన్స్ లేకుండా టపాసులు నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.