హిందీ దివస్ వేడుకల్లో సమ్మోహనపరిచిన చిన్నారుల ప్రదర్శనలు

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురంలోని శ్రీ సత్య సాయి బాబా స్కూల్లో ముందస్తు హిందీ దివాస్ వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హిందీ భాషా ప్రాముఖ్యతను చాటిచెబుతూ పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఏడో తరగతి విద్యార్థిని మీరాబాయి వేషధారణలో అలరించి అందరి ప్రశంసలు అందుకోగా, మిగిలిన విద్యార్థులు హిందీ గేయాలకు వేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఉపాధ్యాయులు హిందీ భాష విశిష్టతను వివరిస్తూ సందేశానిచ్చారు. ప్రతిభ కనబరిచిన చిన్నారులను పాఠశాల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ఘనంగా అభినందించారు.