గురుగ్రామ్‌లో నకిలీ యాపిల్ సర్వీస్ సెంటర్ గుట్టురట్టు చేసిన పోలీసులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: గురుగ్రామ్
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని పాలమ్ విహార్‌లో అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ యాపిల్ సర్వీస్ సెంటర్‌ను నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీకి చెందిన జై కక్కర్ ఈ రాకెట్‌ను ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. అరవై ఏళ్లకు పైబడిన వృద్ధులను టార్గెట్ చేసి, వారి ఐఫోన్లలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు తప్పుడు సందేశాలు పంపి ఫెడరల్ ట్రేడ్ కమిషన్ పేరుతో బెదిరించి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.