ప్రధాని మోదీ ప్రజాసేవకు రెండున్నర దశాబ్దాలు: మనుబోలులో కూటమి సంఘీభావ ర్యాలీ
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులు ఘనంగా బైకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో నాయకులు మోదీ సేవలను కొనియాడుతూ నినాదాలు చేశారు. పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపారని ప్రశంసించారు.