రామాయణ చిత్రంలో రాముడి పాత్ర తీరుపై నటుడు ముఖేష్ ఖన్నా ఆగ్రహం

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

రామాయణ చిత్రంలో శ్రీరాముడి పాత్రను యాక్షన్ హీరోలా చూపించడంపై ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాముడిని కమాండోలా చెట్లు ఎక్కుతూ, బాణాలు వేస్తున్నట్లు చూపించడం మన సంప్రదాయానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. మర్యాదా పురుషోత్తముడైన రాముడిని అలా చిత్రీకరించడం తప్పు అని, హిందువులు సాఫ్ట్ టార్గెట్ కావడంతోనే ఇలాంటి చిత్రాలు వస్తున్నాయని ముఖేష్ ఖన్నా మండిపడ్డారు.