విజయనగరంలో తేరాపంత్ యువక్ పరిషత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయనగరం
విజయనగరం కంటోన్మెంట్‌లోని బాలాజీ టెక్స్‌టైల్స్ మార్కెట్‌లో తేరాపంత్ యువక్ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రారంభించారు. అత్యవసర సమయంలో రోగులకు రక్తం ఎంతో అవసరమని, జిల్లాలో రక్త నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.