హైవేపై రవాణాశాఖ ప్రత్యేక తనిఖీలు: నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై జరిమానాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: అమలాపురం

అమలాపురం జాతీయ రహదారిపై రవాణాశాఖ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మరియు మూడు లారీలను సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. మొత్తం ఏడు వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.20,400 జరిమానా విధించినట్లు ఆయన పేర్కొన్నారు. రహదారి భద్రతా నిబంధనలను డ్రైవర్లు విధిగా పాటించాలని స్పష్టం చేశారు.