అంగన్వాడీ కార్యకర్తల సేవలను అభినందించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 14 లక్షల అంగన్వాడీ కేంద్రాల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ తెలంగాణ శాఖ నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 7 వరకు కొనసాగే ఈ కార్యక్రమం ద్వారా ఆశా, అంగన్వాడీ కార్యకర్తల నిరంతర సేవలను గుర్తించి, వారిని సత్కరించడం తమ ముఖ్య ఉద్దేశమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ఈ వేడుకలు అండగా నిలుస్తాయని వారు తెలిపారు.