మద్దూరులో నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేసిన ముగ్గురు అరెస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: మద్దూరు

గణేష్ నిమజ్జనం సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేసిన ముగ్గురిపై మద్దూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మద్దూరు మండలంలోని పెదిరిపహాడ్ గ్రామంలో డీజేలకు అనుమతి లేనప్పటికీ ఉల్లంఘించినట్లు మద్దూరు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.