నెల్లూరులో మీడియా అకాడమీ చైర్మన్ పర్యటన.. తరగతులు
రిపోర్టర్: VG ReddyD SrJournalist
స్థలం: నెల్లూరు అర్బన్
ఆంధ్రప్రదేశ్ సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు అకాడమీ సెక్రటరీ కస్తూరి బాయి తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని గ్రామీణ జర్నలిస్టులకు ప్రత్యేకంగా రిఫ్రెషర్ తరగతులు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 5, 6 తేదీల్లో జడ్పీ సమావేశ మందిరం మరియు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ఈ తరగతులు కొనసాగుతాయి.