కాలువల ద్వారా చెరువులు నింపాలని అధికారులకు వినతి
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
నేలకొండపల్లి మండలం వివిధ గ్రామాల్లో తాగు మరియు సాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతులు ఎన్నెస్పీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ భూక్యా సుధాకర్ మాట్లాడుతూ కాలువల ద్వారా చెరువులను నీటితో నింపితే భూగర్భజలాలు పెరిగి తాగునీటి ఎద్దడి నివారించవచ్చని తెలిపారు. రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను తీవ్రంగా దృష్టిలో ఉంచుకుని చెరువులు నింపేందుకు అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన గట్టిగా కోరడం జరిగింది.