కారుణ్య మరణం పొందిన ప్రముఖ ఫ్రెంచ్ నటుడు ఆర్నాడ్ డేవిస్
రిపోర్టర్: గోపి
స్థలం: ఫ్రాన్స్
తీవ్ర అనారోగ్య సమస్యలతో కొన్ని సంవత్సరాలుగా పోరాడిన ప్రముఖ ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు ఆర్నాడ్ డేవిస్ 43 ఏళ్ల వయసులో బెల్జియంలో కారుణ్య మరణం ద్వారా కన్ను మూశారు. హెర్నియా శస్త్రచికిత్స వికటించడం వల్ల వచ్చిన తీవ్ర ఇబ్బందుల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన న్యాయవాది మీడియాకు వెల్లడించారు. తన మరణానికి ముందు సాషల్ మీడియాలో ఆయన ఒక భావోద్వేగ పోస్టును షేర్ చేస్తూ గత మూడేళ్లుగా భరించలేని నరకయాతన అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు.