రాజాపేటలో శ్రీ బాబా కాలభైరవ మందిర భూమి పూజ
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి మఠం దేవాలయం ఆవరణలో శ్రీ బాబా కాలభైరవ మందిర భూమి పూజ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేయగా, వైదిక మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా భూమి పూజ సాగింది.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్, సర్పంచి కోయ మధుతో పాటు పలువురు గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాంప్రదాయ బద్ధంగా సాగిన ఈ వేడుకలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.