కొచ్చిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదు రెట్లు అధికంగా మద్యం తాగి డ్రైవింగ్

రిపోర్టర్: నరేష్ స్థలం: Kochi

కొచ్చి విమానాశ్రయం సమీపంలో జరిగిన మినీ కూపర్ కారు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా, ప్రధాన నిందితుడు సుహైల్ సజీవ్ రక్తంలో అనుమతి కంటే ఐదు రెట్లు అధికంగా ఆల్కహాల్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై గురువారం పోలీసులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. నిందితుడిపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.