వైఎస్ వివేకా హత్య కేసు: ఈడీ విచారణకు వైఎస్ భాస్కరరెడ్డి హాజరు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కరరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. హత్యకు కుట్ర పన్నడం, డబ్బు సమకూర్చడం, ఆధారాలు ధ్వంసం చేయడంలో ఆయన పాత్ర ఉందని సీబీఐ గతంలో తేల్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు.