ఎన్నికల కుట్రపై సమగ్ర విచారణ జరగాలన్న కాంగ్రెస్ నేత రాహుల్
రిపోర్టర్: సురేష్
స్థలం: ఖమ్మం
ఎన్నికల వ్యవస్థలో అవకతవకలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎన్నికలను అపహరించేందుకు జరిగిన కుట్రపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానే కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ ఆరోపణలను అధికార బీజేపీ తీవ్రంగా ఖండించింది.