వైసీపీ హయాంలోనే పెన్షన్ల కోత.. కూటమి నేతల విమర్శలు
రిపోర్టర్: Pydi. Suryanarayana
స్థలం: ఆమదాలవలస
గత వైసీపీ పాలనలో అర్హులైన ఎంతోమంది పెన్షన్లను కోల్పోయారని కూటమి నాయకులు ఆరోపించారు. అప్పుడు కళ్ళు తెరవని వైసీపీ నాయకులు, ఇప్పుడు పెన్షన్ల గురించి మాట్లాడటం చాలా శోచనీయమని వారు ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ పథకాల అమలులో గతంలో జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ నేతలు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజల సంక్షేమం కంటే రాజకీయ లబ్ధి కోసమే వారు ప్రయత్నిస్తున్నారని కూటమి నాయకులు మండిపడ్డారు.