స్థానిక సంస్థల ఎన్నికలు: అభ్యర్థులు కచ్చితంగా పాటించాల్సిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

స్థానిక సంస్థల ఎన్నికల పోరులో భాగంగా అభ్యర్థులు నామినేషన్లు వేసి ప్రచారానికి సిద్ధమయ్యారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళిని రూపొందించింది. అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించడం, ప్రైవేట్ ఆస్తులపై అనుమతి లేకుండా పోస్టర్లు అంటించడం వంటి నిషిద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.